కోడెల మా మధ్య లేరన్నది బాధాకరం..ఓ నమ్మలేని నిజం: నందమూరి బాలకృష్ణ
- సమాజానికి కోడెల ఎనలేని సేవలు చేశారు
- ఎంతో మందికి ఆదర్శనీయుడు
- ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారు
హైదరాబాద్ లో బసవతారకం ఆసుపత్రిని నిర్మించాలని తన తండ్రి ఎన్టీ రామారావు అనుకున్నప్పుడు కోడెల ముందుండి నడిచారని, ముఖ్యమైన పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కోడెల ఎంతో మందికి ఆదర్శనీయుడని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మరిచిపోలేని సేవలు అందించారని, కోడెల ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు.