మహేశ్ కోసం అనుకున్న కథను రణబీర్ తో చేయనున్న సందీప్ రెడ్డి
- 'కబీర్ సింగ్'తో హిందీలో హిట్
- రణబీర్ తో 'డెవిల్' మూవీ
- డార్క్ క్రైమ్ స్టోరీ నేపథ్యం
ఈ డార్క్ క్రైమ్ స్టోరీకి 'డెవిల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొన్నాళ్ల క్రితం మహేశ్ బాబుతో తెలుగులో ఒక సినిమా చేయాలని సందీప్ రెడ్డి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథను సందీప్ రెడ్డి .. రణబీర్ కి చెప్పి ఒప్పించాడని అంటున్నారు. ఈ సినిమాను మరింత బోల్డ్ గా .. రఫ్ గా తీయనున్నట్టు సందీప్ రెడ్డి ముందుగానే చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.