అడివి శేష్ కోసం జపాన్ నుంచి వచ్చిన యువతి!
- జపాన్ లో తెలుగు చిత్రాలకు పెరుగుతున్న క్రేజ్
- 'బాహుబలి'తో జపాన్ ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన ప్రభాస్
- అడివి శేష్ 'ఎవరు' చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న జపనీయులు
శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎవరు' జపాన్ లో కూడా విడుదలైంది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రీనా మట్సుయి అనే ఓ అమ్మాయి టోక్యోలో ఈ సినిమా చూడడమే కాదు, హైదరాబాద్ లో కూడా ఈ సినిమా చూడాలని ఇండియా వచ్చేసింది. ఈ విషయం అడివి శేష్ కు తెలియడంతో రీనాకు అపాయింట్ మెంట్ ఇచ్చాడు. ఆ జపాన్ యువతి తన అభిమాన హీరోను చూడగానే భావోద్వేగాలు పట్టలేకపోయింది. అడవి శేష్ ను గట్టిగా హత్తుకుని కన్నీటి పర్యంతమైంది. ఆమె అభిమానం చూసి శేష్ కూడా కదిలిపోయారు. తనే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.