టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు క్షమాపణ చెప్పిన యాంకర్ అనసూయ
- నల్లమల అడవులను కాపాడుదామని ట్వీట్ చేసిన అనసూయ
- మాజీ అటవీ మంత్రి జోగు రామన్నకు ట్యాగ్ చేసిన వైనం
- ప్రస్తుతం ఆయన అటవీ మంత్రి కాకపోవడంతో క్షమాపణ చెప్పిన అనసూయ
ఆ తర్వాత ఆమె తన తప్పును గుర్తించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అటవీశాఖ మంత్రిగా గతంలో ఉన్న జోగు రామన్నకు ఈసారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో, 'జోగు రామన్న గారు నన్ను క్షమించండి' అని ట్వీట్ చేసింది. కరెంట్ అఫైర్స్ పై తనకు పట్టు లేదని తెలిపింది. ఈ అభిప్రాయాలను ప్రస్తుత తెలంగాణ అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫార్వర్డ్ చేస్తున్నానని... తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరింది. నల్లమల అడవులను కాపాడుదామని విన్నవించింది.