సెన్సేషనల్ స్టార్ తో అజయ్ భూపతి మూవీ
- 'ఆర్ ఎక్స్ 100'తో భారీ హిట్
- తదుపరి ప్రాజెక్టు విషయంలో ఆలస్యం
- భవ్య క్రియేషన్స్ బ్యానర్లో కొత్త చిత్రం
తాజాగా ఓ సెన్సేషనల్ స్టార్ హీరోతో అజయ్ భూపతి సినిమా ఖరారైపోయింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన ఈ సినిమా చేయనున్నాడు. భవ్య క్రియేషన్స్ వారే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తాము నిర్మించనున్న సినిమాలో ఒక సెన్సేషనల్ స్టార్ హీరో నటించనున్నట్టు ప్రకటించారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.