పవన్ సిగ్గుపడిన క్షణాలను అందరితో పంచుకున్న సమంత!
- అత్తారింటికి దారేది చిత్రంలో జంటగా నటించిన పవన్, సమంత
- స్విట్జర్లాండ్ లో జనాన్ని చూసి పవన్ దూరంగా వెళ్లిపోయాడన్న సమంత
- త్రివిక్రమ్ వెళ్లి కాన్ఫిడెన్స్ నింపాడని వెల్లడి
అక్కడి అందమైన లొకేషన్లలో ఓ పాట షూట్ చేస్తుండగా, చాలామంది జనం వచ్చారని, వాళ్లను చూసిన పవన్ తాను స్టెప్పులు వేయలేనంటూ కారవాన్ వద్దకు వెళ్లిపోయారని వెల్లడించింది. అయితే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్లి "పవన్ నువ్వు చేయగలవు!" అని కాన్ఫిడెన్స్ నింపడం, "నేను చేయగలనంటావా!" అంటూ పవన్ బెరుకుగా మాట్లాడ్డం చూసి నవ్వుకున్నానని తెలిపింది. పవన్ పవర్ స్టార్ అయినా ఎంతో సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి అనిపించిందని, ఆ మనస్తత్వమే పవన్ లో తనకు బాగా ఇష్టమైన అంశమని సమంత వివరించింది.