యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేస్తోన్న బాలయ్య
- యాక్షన్ ఎంటర్టైనర్ గా బాలకృష్ణ మూవీ
- రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- సంక్రాంతికి సినిమా విడుదల చేసే ఆలోచన
అన్బు - అరివు కంపోజ్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. భూమిక కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా బాలకృష్ణ సాధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో చేరుతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.