ఒక్కరే మహానటి కాదు... ప్రతి ఒక్కరూ మహానటే!: జయసుధ
- టీఎస్సార్ అవార్డుల ప్రెస్ మీట్ లో జయసుధ వ్యాఖ్యలు
- తన దృష్టిలో అందరూ మహానటీమణులేనన్న జయసుధ
- జయసుధకు అభినయ మయూరి అవార్డు
ప్రముఖ వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి తన టీఎస్సార్ కళాపరిషత్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి జయసుధ కూడా హాజరయ్యారు. జయసుధను అభినయ మయూరి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ చేశారు. ఈ సమావేశంలోనే జయసుధ పైవ్యాఖ్యలు చేశారు. ఇక సుబ్బరామిరెడ్డి గురించి చెబుతూ, సీనియర్ తారలను గుర్తుపెట్టుకుని ప్రతి ఏడాది సత్కరించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు.