నటుడిగా నాకు వచ్చిన పేరు ప్రతిష్ఠలు ఈవీవీ గారి చలవే: ఎల్బీ శ్రీరామ్
- రచయితగా ఈవీవీ గారు ప్రోత్సహించారు
- కృష్ణవంశీ ఆ సలహా ఇచ్చారు
- నటుడిగా లైఫ్ ఇచ్చింది ఈవీవీ గారే
రచయితగా నేను ఈవీవీ గారికి బాగా తెలుసు, అందువలన నటుడిగా ఆయన అవకాశం ఇస్తాడో లేదోననే సందేహంతోనే వెళ్లాను. నేను తీయించుకున్న ఫొటోలను ఈవీవీ గారికి చూపించాను. ఆయన కొన్ని ఫొటోలు తీసుకుని తన డెస్క్ లో పెట్టుకున్నారు. ఆ తరువాత 'చాలా బాగుంది' సినిమాలో ఆయన ఇచ్చిన వేషం నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా నుంచి నటుడిగా నేను వెనుదిరిగి చూసుకోలేదు. రచయితగా .. నటుడిగా నేను ఎదగడానికి కారకులు ఈవీవీ గారే" అని చెప్పుకొచ్చారు.