నేనెప్పుడూ డీలాపడిపోలేదు: హీరో ప్రిన్స్
- తేజగారు తొలి ఛాన్స్ ఇచ్చారు
- మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను
- జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న ప్రిన్స్
ఆ తరువాత వరుసగా సినిమాలు పరాజయంపాలు కావడం, అవకాశాలు తగ్గుతూ రావడం జరిగింది. ఒకటి రెండేళ్లు ఖాళీగా వుండిపోయిన సందర్భాలు వున్నాయి. అయినా ఇలా జరిగిందేంటబ్బా అనుకుంటూ నేను డీలాపడిపోలేదు. నాకు తెలియని విషయాలు తెలుసుకునేవాడిని. అలా గ్యాప్ వచ్చినప్పుడల్లా యాక్టింగ్ కోర్స్ చేశాను .. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను .. డాన్స్ నేర్చుకున్నాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయం నాకు తెలుసు గనుక, ఆశతో .. నమ్మకంతో ముందుకు వెళుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.