'బాహుబలి'లో ఆ పాట రాయడానికి 73 రోజులు పట్టింది: సినీ గేయరచయిత అనంత శ్రీరామ్
- 'పచ్చబొట్టేసిన' పాట బాగా పాప్యులర్ అయింది
- పాత్రల్లో వైవిధ్యం .. నేపథ్యం ఇబ్బంది పెట్టాయి
- ఆలోచనలతోనే 20 రోజులు గడిచిపోయాయి
తమన్నా పెరిగిన నేపథ్యం .. ఆమె భాష .. వున్న పరిస్థితులు వేరు. పాట పరంగా వీళ్లిద్దరినీ కలపాలంటే ఏ పదాలను ఎంచుకోవాలి అనే ఆలోచన మొదలైంది. పూర్తిగా గ్రామ్యం గానీ .. గ్రాంధికంగాని ఎంచుకునే అవకాశం లేదు. ఈ రెండు పాత్రల మధ్య భావాల పరంగా ఒక సమతుల్యత ఎలా తీసుకురావాలనే ఆలోచనతోనే 20 రోజులు గడిచిపోయాయి. పాట తరువాత జరిగే సన్నివేశాల తాలూకు భావాలు కూడా ఈ పాత్రల్లో కనిపించాలి. వీటన్నింటిని సమన్వయం చేసుకుంటూ ఈ పాటను రాయడానికి నాకు 73 రోజులు పట్టింది" అని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.