'నిన్నుకోరి' దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్
- త్వరలో 'గ్యాంగ్ లీడర్'తో ప్రేక్షకుల ముందుకు
- తదుపరి సినిమాగా 'వి'
- నానికి కథ వినిపించిన శివ నిర్వాణ
'వి' తరువాత ప్రాజెక్టును తాజాగా నాని సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే నానీని దర్శకుడు శివ నిర్వాణ కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ నానీకి బాగా నచ్చేసిందని అంటున్నారు. అంతేకాదు కొంతకాలం క్రితం తనకి 'నిన్నుకోరి' సినిమాతో హిట్ ఇచ్చిన కారణంగా, ఇటీవల 'మజిలీ' సినిమాతోను శివ నిర్వాణ తన సత్తా చాటుకోవడం వలన వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం.