Valmiki: 'వాల్మీకి' చిత్రం టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్
- వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం
- 'వాల్మీకి' టైటిల్ బోయలను కించపరిచేదిగా ఉందన్న బోయ హక్కుల సమితి
- పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'వాల్మీకి' చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల సమితి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'వాల్మీకి' టైటిల్ బోయలను కించపరిచేలా ఉందని, ఈ చిత్రానికి పేరు మార్చేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలని బోయ హక్కుల సమితి నేతలు తమ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. చిత్ర యూనిట్ ఇప్పటికైనా స్పందించి టైటిల్ మార్చాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని బోయ హక్కుల నేతలు హెచ్చరించారు. కాగా, ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.