ఓ సామాజికవేత్తకు పాదాభివందనం చేసిన అమితాబ్ బచ్చన్
- కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి విశిష్ట అతిథి
- వెయ్యి మంది అనాథలకు అన్నీ తానై వ్యవహరిస్తున్న సింధూ తాయి
- ఆమె గురించి తెలుసుకుని కదిలిపోయిన అమితాబ్
ఈ సందర్భంగా సింధూ తాయి ఓ మరాఠీ కవితను వినిపించారు. "నీ అశ్రువులతో జీవిత దర్శనం చేసుకో. ప్రతి విలాపం తర్వాత నవ్వడం అలవర్చుకో. ఎందుకంటే నేనెప్పుడూ నీతోనే ఉంటాను కదా. నేను నీకు తల్లిలాంటి దాన్ని" అంటూ సాగే ఆ కవిత అమితాబ్ ను సైతం ఆకట్టుకుంది.