చాలారోజుల తర్వాత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు
- ఐదు నెలల తరువాత ట్వీట్లు
- 'సైరా' విజయవంతం కావాలి
- అమితాబ్ ను కలిసిన క్షణాలు మధురమన్న పవన్
'సైరా' సినిమా సందర్భంగా అమితాబ్ ను కలిసిన వేళ, తీసిన చిత్రాలను పోస్ట్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫోటోను కూడా చూపించారు. నిన్నటి నుంచి నరసింహారెడ్డి గురించి, ఆయన ఘనతల గురించి ఇంటర్నెట్ మొత్తం మారుమోగి పోతోందని అన్నారు. భారత చరిత్ర అంటే కేవలం ఢిల్లీ చరిత్ర కాదని, చరిత్ర మరచిన ఎందరో వీరులున్నారని అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తన జీవితంలోని మధురమైన క్షణాల్లో అమితాబ్ బచ్చన్ ను కలిసిన సమయం ఎంతో అద్భుతమైనదని అన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.