ఇకపై కథల విషయంలో రాజీ పడను: శర్వానంద్
- ఇటీవల థియేటర్లకు వచ్చిన 'రణరంగం'
- వసూళ్ల విషయంలో 'ఎవరు' కంటే వెనుకబాటు
- అయోమయంగా ఉందన్న శర్వానంద్
తాజాగా ఆయన మాట్లాడుతూ .. 'రణరంగం' బాగోలేదని ఎవరూ అనడం లేదు .. కానీ అందులో ఏదో మిస్ అయింది. ఈ కారణంగానే ఈ సినిమా సరిగ్గా ఆడటం లేదు. అయితే కథలో ఏం లోపించిందనే విషయంలో ఇండస్ట్రీ ఫీడ్ బ్యాక్ ఒకలా వుంది .. బయట వేరేలా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఏదీ అర్థం కావడం లేదు. ఇకపై కథలపై మరింత శ్రద్ధ పెడతాను. అవసరమైతే ఎక్కువ సమయం తీసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు.