రజనీకాంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా?
- రజనీకాంత్ ను ఆకర్షించే పనిలో బీజేపీ
- పార్టీలో చేరితే పార్టీ పగ్గాల అప్పగింత
- రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధం
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగా రజనీకాంత్ పోల్చిన సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయంలో మోదీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయాలను రజనీ ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలో, బీజేపీ పట్ల రజనీ సానుకూల ధోరణితో ఉన్నారనే విషయం అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రజనీ తమతో చేయి కలిపితే... తమిళనాట పాగా వేయవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో వేచి చూడాలి.