విష్వక్సేన్ కొత్త చిత్రంగా 'పాగల్'
- విభిన్న ప్రేమకథా చిత్రంగా 'పాగల్'
- దర్శకుడిగా నరేశ్ రెడ్డి పరిచయం
- సెప్టెంబర్ 2వ వారం నుంచి షూటింగ్
ఈ క్రమంలో విష్వక్సేన్ తదుపరి సినిమాగా 'పాగల్' పట్టాలెక్కనుందనేది తాజా సమాచారం. బెక్కమ్ వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేశ్ రెడ్డి కుప్పిలి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సందర్భంగా బెక్కమ్ వేణుగోపాల్ మాట్లాడుతూ .. "ఇది ఒక ప్రేమకథా చిత్రం .. దర్శకుడు కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఈ కథకు విష్వక్సేన్ సరిగ్గా సరిపోతాడు. సెప్టెంబర్ రెండవవారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నాము. మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాము" అని అన్నారు.