నా తదుపరి సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది: యాంకర్ అనసూయ
- నిరాశ పరిచిన 'కథనం'
- కొత్త కథకి ఓకే చెప్పానన్న అనసూయ
- సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి
అయితే ఈ సారి తను చేయనున్న సినిమా మాత్రం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందని అనసూయ చెప్పింది. తను ఓకే చెప్పిన కథ ఎంతో విభిన్నంగా ఉంటుందనీ, తన పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని అంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనీ, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అంది. 'కథనం'తో అభిమానులను నిరాశ పరిచిన అనసూయ, తాజాగా ఈ ప్రకటనతో అందరిలోను ఆసక్తిని పెంచేసింది.