'డిస్కోరాజా' సరసన తాన్యా హోప్
- వీఐ ఆనంద్ నుంచి 'డిస్కోరాజా'
- రవితేజ సరసన ముగ్గురు భామలు
- త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ నటిస్తున్నారు. మరో హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి చివరికి 'తాన్యా హోప్'ను ఖరారు చేశారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో తాన్యా హోప్ జాయిన్ అవుతుందని అంటున్నారు. రవితేజ - తాన్యా హోప్ కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకోనుంది.