సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజ సరసన మళ్లీ రాశిఖన్నా
- విజయశాంతిపై సోలో దృశ్యాల చిత్రీకరణ
- బరువు పెంచుతున్న కంగన
* మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ప్రస్తుతం కీలక పాత్రధారి విజయశాంతిపై సోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
* తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా 'తలైవి' చిత్రం రూపొందుతోంది. ఇందులో జయలలిత పాత్రలో నటిస్తున్న కంగన రనౌత్ ఈ పాత్ర పోషణ కోసం ప్రత్యేక శద్ధ తీసుకుంటోంది. ఇప్పటికే తమిళం నేర్చుకుంటున్న కంగన, ప్రస్తుతం బరువు పెరిగే పనిలో కూడా వుందట. దాదాపు పది కిలోల బరువు పెరగడానికి ప్రయత్నిస్తోందని సమాచారం.