అజిత్ దర్శకుడితో సూర్య సినిమా
- విడుదలకి ముస్తాబవుతోన్న 'కాప్పన్'
- తదుపరి సినిమా కథపై కసరత్తు
- శివ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా సినిమా
కొంత కాలంగా వరుస పరాజయాలతో సూర్య సతమతమవుతున్నాడు. శివ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కథను సిద్ధం చేయమని సూర్య చెప్పాడట. ప్రస్తుతం అదే పనిలో శివ వున్నట్టుగా సమాచారం. సూర్య తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'కాప్పన్' రానుంది. ఈ సినిమా విడుదల తరువాత సూర్య - శివ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా జ్ఞానవేల్ రాజా వ్యవహరించనున్నాడని అంటున్నారు.