నటిపై లైంగిక వేధింపులు... టీవీ స్టార్ అభినవ్ అరెస్ట్!
- ముంబైలో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
- అసభ్య చిత్రాలను చూపుతూ కోరిక తీర్చాలని వేధింపులు
- అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
తనను దారుణంగా తిట్టడంతో పాటు, అసభ్యకరంగా ఉన్న మోడల్స్ ఫోటోలను తనకు నిత్యమూ చూపించి, కోరిక తీర్చమని బలవంతం పెట్టేవాడని సదరు నటి ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీంతో అభినవ్ పై ఐపీసీ సెక్షన్ 354-ఏ, 323, 504, 506 కింద కేసును రిజిస్టర్ చేశామని, అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి, పోలీసు కస్టడీకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.