ముంబైలో 'సైరా' భారీ ఫంక్షన్.. హాజరు కానున్న చిరంజీవి
- ఈ నెల 14న 'సైరా' నుంచి మేకింగ్ వీడియో
- 20వ తేదీన టీజర్ రిలీజ్
- విదేశాలకి వెళ్లనున్న చిరంజీవి
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ నెల 14వ తేదీ నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ రోజున ఈ సినిమా మేకింగ్ వీడియోను వదలనున్నారు. ఈ నెల 20వ తేదీన ముంబైలో ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు .. ఈ వేదికపైనే టీజర్ ను రిలీజ్ చేస్తారు. అమితాబ్ .. చిరంజీవి .. విజయ్ సేతుపతితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ అనంతరం చిరంజీవి విదేశాలకి వెళతారట. తన బర్త్ డే వేడుకను ఆయన అక్కడే జరుపుకోనున్నట్టుగా సమాచారం.