ముఖ్యమంత్రిని కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదు: పృథ్వి వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ కౌంటర్
- సీఎంను సినీ పరిశ్రమకు చెందిన వారు కలవాలనే నిబంధన లేదు
- జగన్ తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి
- సీఎంగా జగన్ సెటిల్ అయిన తర్వాత కలుస్తాం
వాస్తవానికి జగన్ ను రేపు కలవాల్సి ఉందని... అయితే ఇతర బిజీ షెడ్యూల్ వల్ల మరో రెండు, మూడు రోజుల్లో కలిసేందుకు ఆయన అవకాశమిచ్చారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు.