కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని సమర్థించిన సీనియర్ నేత... ఇరకాటంలో కాంగ్రెస్
- చారిత్రాత్మక తప్పిదాన్ని ఆలస్యంగానైనా సరిచేసినట్టైంది
- రామ్ మనోహర్ లోహియా ఈ ఆర్టికల్ ను తొలి నుంచి వ్యతిరేకించారు
- ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
తనకు స్ఫూర్తిప్రదాత అయిన రామ్ మనోహర్ లోహియా తొలి నుంచి ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ వచ్చారని... విద్యార్థులుగా ఉన్న తాము ఆయన అభిప్రాయాలపై చర్చించుకునేవారమని ద్వివేది తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం యావత్ దేశం సంతృప్తి చెందే విషయమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో చేసిన తప్పును ఆలస్యంగానైనా సరి చేశారని కితాబిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడిస్తున్నానని చెప్పారు.