రీతూవర్మకి కాలం కలిసొచ్చినట్టే
- 'పెళ్లిచూపులు'తో తెలుగు తెరకి పరిచయం
- దుల్కర్ 25వ సినిమాలో దక్కిన ఛాన్స్
- వెతుక్కుంటూ వస్తోన్న వరుస అవకాశాలు
దుల్కర్ 25వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశింగ్ పెరియసామి తెరకెక్కించిన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లోను విడుదల చేయనున్నారు. తెలుగులో 'కనులు కనులను దోచాయంటే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే రీతూ వర్మకి వరుస అవకాశాలు వస్తున్నాయట. ఈ సినిమాతో రీతూకి హిట్ దక్కినట్టేననీ, ఆమెకి కాలం కలిసొచ్చినట్టేననే టాక్ అక్కడ వినిపిస్తోంది.