'గుణ 369' దర్శకుడితో మరోసారి కార్తికేయ
- అర్జున్ జంధ్యాల తొలి చిత్రంగా వచ్చిన 'గుణ 369'
- కార్తికేయతో మరో యాక్షన్ ఎంటర్టైనర్
- డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఆలోచన
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే అర్జున్ జంధ్యాల బిజీగా వున్నాడు. ఈ సినిమా కూడా లవ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉంటుందని అంటున్నారు. డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతర నటీనటులు .. సాంకేతిక వర్గానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.