ఈరోజు ముగిసేలోగా తేలిపోతుంది: చిదంబరం కీలక వ్యాఖ్యలు
- జమ్మూ కశ్మీర్ పై స్పందించిన చిదంబరం
- కశ్మీర్ లో మారుతున్న పరిస్థితులు
- ప్రజాస్వామ్యానికి విఘాతమేనన్న మాజీ ఆర్థికమంత్రి
జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు గంటగంటకూ మారుతుండగా, నేడు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులను తీసుకువస్తున్న బీజేపీ, ఇప్పటికే కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన నేతలను హౌస్ అరెస్ట్ చేసింది. నేతలను ముందు జాగ్రత్త చర్యల పేరిట అరెస్ట్ చేయడంతో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే పనులేవో జరగనున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని కూడా చిదంబరం వ్యాఖ్యానించారు.