తండ్రి పోయిన విషాదంలో ఉన్న రాజీవ్ కనకాలకు చిరంజీవి ఓదార్పు
- అనారోగ్యంతో దేవదాస్ కనకాల కన్నుమూత
- దేవదాస్ భౌతికకాయాన్ని సందర్శించిన చిరంజీవి
- ఆయన లేని లోటు తీరనిదంటూ వ్యాఖ్యలు
అంతేకాకుండా, దేవదాస్ నటనా శిక్షణలో తన తొలిరోజులను చిరంజీవి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు తీరనిదని, అయితే ఆయన జ్ఞాపకాలు మిగిలే ఉంటాయని పేర్కొన్నారు. కాగా, చిరంజీవిని చూడగానే దేవదాస్ కనకాల కుమార్తె శ్రీలక్ష్మి భావోద్వేగాలు భరించలేక భోరున విలపించారు. ఆమెను కూడా చిరంజీవి వాత్సల్యంతో దగ్గరికి తీసుకుని అనునయించారు.