నెక్స్ట్ మూవీ సొంత బ్యానర్లో చేస్తున్నాను: హీరో కార్తికేయ
- కార్తికేయ తాజా చిత్రంగా 'గుణ 369'
- గీతా ఆర్ట్స్ లో చేయనున్నాననేది పుకారు మాత్రమే
- కొత్త దర్శకుడితో చేస్తున్నానన్న కార్తికేయ
'గుణ 369' తరువాత నేను చేయనున్న సినిమా ఆల్రెడీ మొదలైపోయింది. శేఖర్ విఖ్యాత్ అనే దర్శకుడితో నా సొంత బ్యానర్లోనే ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరిగింది. ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. 'శ్రీ' అనే మరో కొత్త దర్శకుడి ప్రాజెక్టును కూడా చేసే అవకాశం వుంది" అని చెప్పుకొచ్చాడు.