దూకుడు తగ్గించని 'ఇస్మార్ట్ శంకర్'
- వసూళ్ల పరంగా దూసుకుపోతోన్న 'ఇస్మార్ట్ శంకర్'
- అడ్డుకట్ట వేయలేకపోయిన 'డియర్ కామ్రేడ్'
- 10 కోట్లకి పైగా 'ఇస్మార్ట్ శంకర్' నైజామ్ వసూళ్లు
ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల వసూళ్లను సాధించించింది. 'డియర్ కామ్రేడ్' విడుదల తరువాత 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్లపై ప్రభావం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ 'డియర్ కామ్రేడ్' జోరు ఆశించినస్థాయిలో లేకపోవడంతో, 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్ల పరంగా తన దూకుడును కొనసాగిస్తూనే వుంది. ప్రస్తుతం విదేశాల్లో వున్న రామ్ అక్కడి నుంచి తిరిగి రాగానే ఇంటర్వ్యూలతో టీవీ ఛానల్స్ లో సందడి చేస్తాడని చెబుతున్నారు.