'గుణ 369'తో హిట్ కొడతాను: హీరో కార్తికేయ
- కార్తికేయ హీరోగా 'గుణ 369'
- కథానాయికగా 'అనఘ' పరిచయం
- ఆగస్టు 2వ తేదీన భారీ విడుదల
అర్జున్ జంధ్యాల ఈ కథ వినిపించగానే నాకు బాగా నచ్చేసిందని చెప్పాను. ఫలానా చోట పాట పడాలి అని కాకుండా .. కామెడీని ఇరికించే ప్రయత్నం చేయకుండా సహజంగా కథను నడిపించడానికే ఆయన ఆసక్తిని చూపుతుంటాడు. ఆయన టేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. హీరోయిన్ 'అనఘ' పాత్ర కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకం వుంది" అంటూ ఆశా భావాన్ని వ్యక్తం చేశాడు.