సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రాజమహేంద్రవరంలో శంకర్ షూటింగ్
- 'కేజీఎఫ్' హీరోతో పూరి ప్రాజక్ట్
- బయోపిక్ నిర్మాణంలో రానా
* మహేశ్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ 'జనగణమన' చిత్రాన్ని ప్లాన్ చేయాలని భావించడం, మహేశ్ దానిని తిరస్కరించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రాన్ని 'కేజీఎఫ్' ఫేం యష్ హీరోగా చేయాలని పూరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.
* ప్రఖ్యాత శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవిత కథను వివిధ భాషలలో తెరకెక్కిస్తున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో హీరో రానా దగ్గుబాటి కూడా ఇప్పుడు భాగస్వామి అయినట్టు తెలుస్తోంది.