దిల్ రాజు నిర్మాణంలో చైతూ సినిమా డౌటేనట!
- చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
- ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి
- తరువాత సినిమా శేఖర్ కమ్ములతో
ఆ తరువాత దిల్ రాజు నిర్మాణంలో చైతూ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో 'శశి' అనే యువ దర్శకుడు పరిచయం కానున్నాడు. తొలుత 'శశి' వినిపించిన కథలో మార్పులు చెప్పిన చైతూ, ఆ తరువాత ఆ కథ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడట. దాంతో మరో కథను తీసుకుని వెళితే నచ్చలేదని చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'మజిలీ' హిట్ నుంచి కథల విషయంలో చైతూ కాస్త గట్టిగానే ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు.