ఆ సినిమా చేసుంటే నా కెరియర్ వేరేలా వుండేది: కమెడియన్ మధునందన్
- 20 ఏళ్ల నుంచి పరిశ్రమలో వున్నాను
- ఆశించినస్థాయి బ్రేక్ రాలేదు
- 'ఎక్స్ ప్రెస్ రాజా' చేసుంటే బాగుండేది
నిజానికి 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలో నేను మంచి రోల్ చేయవలసి వుంది. నేను ఆ సినిమా షూటింగుకి వెళ్లవలసి వుంది. అయితే అంతకు ముందు నేను 'స్పీడున్నోడు' సినిమా ఒక రోజు షూటింగు చేసి వున్నాను. ఆ తరువాత 'స్పీడున్నోడు' వాళ్లు .. 'ఎక్స్ ప్రెస్ రాజా' వాళ్లు సేమ్ డేట్స్ పంపించారు. ముందే 'స్పీడున్నోడు' కమిటైనందువలన 'ఎక్స్ ప్రెస్ రాజా' వదులుకోవలసి వచ్చింది. ఆ సినిమా చేసుంటే నా కెరియర్ వేరేలా ఉండేది" అని ఆయన చెప్పుకొచ్చాడు.