‘జై శ్రీరాం’ నినాదం వినడం ఇష్టం లేకపోతే వేరే గ్రహం మీదికి పో.. సీనియర్ దర్శకుడిపై బీజేపీ నేత ఆగ్రహం
- దేశ ప్రజలు ఓట్లు వేసిందే ‘జై శ్రీరాం’ నినాదానికే
- దేశంలో అదెప్పుడూ మార్మోగుతూనే ఉంటుంది
- వినడం ఇష్టం లేనివాళ్లు శ్రీహరికోటలో పేరు నమోదు చేయించుకోవాలి
ఆదూర్ లేఖపై కేరళ బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది బి.గోపాలకృష్ణన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జైశ్రీరాం నినాదం దేశంలో ఎల్లప్పుడూ మార్మోగుతుంటుందని స్పష్టం చేశారు. ఇరుగు పొరుగు దేశాల్లోనూ ఈ నినాదం వినిపిస్తుందని, వినడం ఇష్టం లేనివాళ్లు శ్రీహరికోటలో పేరు నమోదు చేసుకుని చంద్రమండలంపైకో, మరో గ్రహంపైకో వెళ్లిపోవాలని సూచించారు. దేశ ప్రజలు ‘జై శ్రీరాం’ నినాదానికే ఓట్లు వేశారని అన్నారు. వారు ‘జై శ్రీరాం’ అని నినదిస్తూనే ఉంటారని, కావాలంటే ఆదూర్ ఇంటి ముుందు కూడా నినదిస్తారని గోపాలకృష్ణన్ అన్నారు.