కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ.. ఆపరేషన్ చేసి విస్తుపోయిన వైద్యులు!
- పొట్టలో బంగారం, ఇత్తడి, ఇనుము వస్తువులు
- ఆకలికి తాళలేక మింగేసి ఉంటుందని అనుమానం
- నిలకడగా ఉన్న ఆరోగ్యం
స్కానింగ్ చేసిన వైద్యులు తొలుత షాకయ్యారు. ఆమె పొట్టలో ఆభరణాలు ఉన్నట్టు గుర్తించి వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. పొట్టలో కనిపించిన వస్తువులను చూసి నిర్ఘాంతపోయారు. బంగారం, ఇత్తడి, ఇనుము తదితర వాటితో చేసిన గొలుసులు, దుద్దులు, గడియారం, నాణేలు ఆమె పొట్టలో కనిపించాయి. వాటి మొత్తం బరువు 1.680 కేజీలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆకలిని భరించలేక ఆ వస్తువులను మింగేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.