నీకు నటన రాదు అని విమర్శించినవాళ్లు చాలామంది ఉన్నారు!: హీరోయిన్ రష్మిక
- అలాంటి విమర్శలకు నేను కుంగిపోలేదు
- సవాలుగా తీసుకుని నటించి చూపించాను
- మహేశ్, బన్నీలతో సినిమాలకు ఓకే చెప్పా
‘స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిందంటే అది కచ్చితంగా నా ప్రతిభే. నటించడం సులువని చాలామంది అంటారు. కానీ మనదికాని పాత్రలోకి పరకాయప్రవేశం చేయడం ఎంత కష్టమో అనుభవిస్తే కానీ తెలియదు. ఫ్రేమ్ లో కాస్త నవ్వాల్సి వచ్చినా, ఆ నవ్వు వెనుక ఉన్న భావాల్ని ప్రేక్షకులకు చూపించగలగాలి. గ్లిజరన్ పెట్టుకుని ఏడ్చే అలవాటు నాకు లేదు. ఆ సందర్భాన్ని మనుసులోకి తీసుకుంటే తప్ప భావాలను పలికించలేం’ అని రష్మిక తెలిపింది. రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటించిన 'డియర్ కామ్రేడ్' ఈ నెల 26న (శుక్రవారం) విడుదల కానుంది.