అభిషేక్ కు తాను లక్కీ అని మరోసారి నిరూపించుకున్న ఐశ్వర్య!
- రెండు నెలల తరువాత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్
- పింక్ పాంథర్స్ గెలవాలని ఆకాంక్ష
- యూ ముంబాపై గెలిచిన పింక్ పాంథర్స్
అభిషేక్ మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్న స్క్రీన్ షాట్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఐశ్వర్య, "పింక్ పాంథర్స్.. గాడ్ బ్లెస్" అని క్యాప్షన్ పెట్టారు. దీనికి అభిషేక్ స్పందిస్తూ, "ఐష్.. మా లక్కీ ఛార్మ్" అన్నాడు. ఈ సంవత్సరం మేలో తన తల్లికి బర్త్ డే విషెస్ చెప్పిన తరువాత, ఐష్ మరో పోస్ట్ పెట్టలేదు. ప్రస్తుతం ఆమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియిన్ సెల్వం' అనే చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె చోళ రాణి నందిని పాత్రలో కనిపించనుంది.