మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీగా '22'
- మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- నాయకా నాయికలకు తొలి సినిమా
- ఈ నెల 29 నుంచి రెగ్యులర్ షూటింగ్
హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో హీరోయిన్లపై వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జరుగుతుందనీ, కథకీ .. 22 అనే నెంబర్ కి గల సంబంధం ఏమిటనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దర్శకుడు శివకుమార్ బి. చెప్పాడు.