చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను: నటుడు సంతోష్ వర్మ
- నటుడిగా బుల్లితెరపై మంచి గుర్తింపు
- వెండితెరపై కొనసాగే ప్రయత్నాలు
- సాధించవలసిందేదో వుందన్న సంతోష్ వర్మ
దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లవలసి వచ్చింది. ముందురోజు షూటింగు కారణంగా నిద్రలేదు. అయినా ఉదయానికల్లా పెళ్లికి అందుకోవచ్చనే ఉద్దేశంతో రాత్రివేళ బయల్దేరాను. తెల్లవారు జాము 3 గంటల సమయంలో డ్రైవింగ్ లో ఉండగానే కునుకు పట్టేసింది. అంతే కారు వెళ్లి ట్యాంకర్ ను కొట్టేసింది. అంత పెద్ద ప్రమాదం నుంచి బతికి బయట పడ్డానంటే, నేను సాధించవలసింది ఏదో వుంది అనే నాకు అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.