'మహా సముద్రం' విషయంలో మనసు మార్చుకున్న రవితేజ
- షూటింగు దశలో రవితేజ 'డిస్కోరాజా'
- తదుపరి సినిమాగా 'మహా సముద్రం'
- ప్రత్యేక పాత్రలో హీరో సిద్ధార్థ్
రవితేజ అడిగిన పారితోషికాన్ని తాను ఇవ్వలేనని నిర్మాత తేల్చి చెప్పాడట. అయితే 'మహా సముద్రం' కథ తనకి బాగా నచ్చడంతో, ఆ కథను వదులుకోవడం ఇష్టం లేని రవితేజ, లాభాల్లో వాటా ఇస్తే ఓకే అని అనేశాడట. అందుకు నిర్మాత అంగీకరించిన కారణంగానే ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైందని అంటున్నారు. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.