కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన యువకుడు.. ఆపరేషన్ చేసి 33 వస్తువులు బయటకు తీసిన డాక్టర్లు!
- మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలో ఘటన
- ఎక్స్ రే పరీక్ష చేసి విస్తుపోయిన డాక్టర్లు
- ఆపరేషన్ చేసి పెన్ను, పెన్సిల్, కత్తులు వెలికితీత
కుటుంబ సభ్యులు వెంటనే యోగిత్ ను జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాధితుడికి ఎక్స్ రే తీసిన వైద్యులు కడుపులో పలు వస్తువులు ఉండటం చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి పెన్ను, పెన్సిల్, కత్తులు సహా 33 వస్తువులను బయటకు తీశారు. కాగా, ప్రస్తుతం యోగిత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.