జగపతిబాబు ఆ సినిమా నుంచి తప్పుకున్నది అందుకేనా!
- షూటింగు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
- జగపతిబాబు పాత్రలో మార్పులు
- ప్రాధాన్యత తగ్గిందని భావించిన జగపతి
కానీ జగపతిబాబు తప్పుకోవడంతో, కారణమేమిటో తెలియక అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ముందుగా ఏదైతే చెప్పారో, షూటింగుకి వెళ్లాక ఆ స్థాయిలో తన పాత్ర లేదనే సందేహం జగపతిబాబుకి కలిగిందట. అదే విషయాన్ని ఆయన దర్శకుడి దగ్గర ప్రస్తావించడం .. అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందని అంటున్నారు. తన పాత్ర రూపకల్పనలో మార్పులు చేయడం నచ్చకపోవడం వల్లనే జగపతిబాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని అంటున్నారు.