ప్రభుదేవా వంటి డాన్సర్ ఇండియాలోనే లేడు: తండ్రి సుందరం మాస్టర్
- నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం
- నా పిల్లలను డాన్స్ దిశగా ఎంకరేజ్ చేశాను
- ప్రభుదేవా అద్భుతాలు చేశాడు
అప్పట్లో సినిమావాళ్లు తమ పిల్లలను సినిమాలవైపు రానిచ్చేవారు కాదు. కొంతమంది తమ పిల్లలను స్టూడియో వైపు కూడా రానిచ్చేవారు కాదు. అలాంటి రోజుల్లోనే నా ముగ్గురు పిల్లలకు డాన్స్ నేర్పించి కొరియోగ్రఫర్స్ గా చేశాను. మా అబ్బాయి ప్రభుదేవా గురించి నేను గర్వంగా చెబుతాను .. ఇండియాలో అలాంటి డాన్సర్ లేడు. సినిమాల్లో ఒక కొరియోగ్రఫర్ గా నేనేం చేశానో తెలియదుగానీ, ప్రభుదేవా మాత్రం అద్భుతాలు చేశాడు. అందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అన్నారు.