హీరో లుక్ కోసం కసరత్తులు చేస్తోన్న వినాయక్
- నటన వైపుకు వినాయక్ అడుగులు
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
- నిర్మాతగా తెరపైకి దిల్ రాజు పేరు
'శరభ' దర్శకుడు నరసింహారావు ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథకి నాయకుడిగా ఆయన వినాయక్ ను ఎంచుకున్నాడు. దాదాపు తన చుట్టూ తిరిగే ఈ కథతో వినాయక్ పూర్తిస్థాయి నటుడిగా తెరపై కనిపించనున్నారు. పాత్రకి తగినట్టుగా బరువు తగ్గడం కోసం ఆయన జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారని టాక్ వినిపిస్తోంది.