కీర్తి సురేశ్ మూవీకి సమర్పకుడిగా దిల్ రాజు
- కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా సినిమా
- ప్రత్యేకమైన పాత్రలో జగపతిబాబు
- త్వరలో రానున్న ఫస్టులుక్
వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ ఏమిటనేది తెలుసుకున్న దిల్ రాజు, సమర్పకుడిగా వ్యవహరించడానికి ముందుకు వచ్చాడనేది తాజా సమాచారం. దాంతో 'వెల్ కమ్ ఆన్ బోర్డు సార్' అంటూ నిర్మాతలు దిల్ రాజు ను తమ టీమ్ లోకి ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టులో దిల్ రాజు భాగమైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేసుకుని, త్వరలో ఫస్టులుక్ ను విడుదల చేయనున్నామని నిర్మాతలు చెప్పారు.