ఇకపై ఎవరేమనుకున్నా పట్టించుకోను: శ్రుతి హాసన్
- ట్రోలింగ్ నన్ను బాగా బాధ పెట్టింది
- ఇక మీదట కెరియర్ పైనే పూర్తి దృష్టి
- ఎలాంటి కామెంట్స్ ను పట్టించుకోనన్న శ్రుతి
తాజా ఇంటర్య్వూలో మాట్లాడుతూ, నేను లవ్ లో వున్నప్పుడు ఎవరికి తోచింది వాళ్లు రాశారు. అలాగే అనారోగ్య కారణం వలన కాస్త లావైనప్పుడు కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగానే అవి నన్ను చాలా బాధించాయి. ఇకపై ట్రోలింగ్ ను గానీ .. కామెంట్స్ ను గాని పట్టించుకోవద్దని నేను నిర్ణయించుకున్నాను. ఎవరేమైనా అనుకోని, కెరియర్ పై దృష్టిపెట్టి నా పనిని నేను చేసుకుపోవాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.