సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మళ్లీ ప్రేమలో పడిన కథానాయిక
- నితిన్ సినిమాలో హెబ్బా పటేల్
- కీలక పాత్ర పోషిస్తున్న రష్మీ
* ఇటీవలి కాలంలో తెలుగులో సినిమాలు తగ్గిపోయిన కథానాయిక హెబ్బా పటేల్ కు తాజాగా నితిన్ సినిమాలో అవకాశం వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న 'భీష్మ' చిత్రంలో ఓ కీలక పాత్రకు హెబ్బా పటేల్ ను తీసుకున్నారట.
* 'జబర్దస్త్' టీవీ షో ద్వారా పాప్యులర్ అయిన అందాలభామ రష్మీ గౌతం తాజాగా ఓ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఓంకార్ దర్శకత్వం వహించే 'రాజుగారి గది-3' లో ఓ కీలక పాత్రలో నటించడానికి రష్మీ ఒప్పుకుంది.